విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు 2025 సంవత్సరం లో అగ్రిసెట్ పరీక్ష రాసే విద్యార్దుల కోసం APPLECET -ఆపిల్ సెట్ అనే ఒక ప్రవేశ పరీక్ష ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష లో అత్యధిక మార్కులు సంపాదించి టాప్ రాంకు పొందిన విద్యార్ధులకు అగ్రిసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ యొక్క ఫీజు లో భారీగా రాయతీని అందిస్తోంది.
అగ్రిసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ (DA, DST, DOF) ప్రారంభ తేదీ : డిసెంబర్ 9, 2024 సోమవారం నుండి
విజయ్ కుమార్ అగ్రి అకాడమీ ని విజయనగరం దగ్గర లోని సాలూరు పట్టణం లో 2018 సంవత్సరం లో ప్రారంభించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో DA, DST, DOF కోర్సులకు శిక్షణ ఇస్తున్న ఏకైక ఇనిస్టిట్యూట్ కూడా ఇదే. స్థాపించిన సంవత్సరం నుండి ఇప్పటికి 5 సార్లు అగ్రిసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఇనిస్టిట్యూట్ మన విజయ్ కుమార్ అగ్రి అకాడమీ.
అత్యాధునిక బోధనా వసతులతో ఏసీ క్లాస్ రూమ్ లు కలిగి, సాలూరు పట్టణం యొక్క నడిబొడ్డున కోచింగ్ సెంటర్ తో పాటు హాస్టల్ సౌకర్యాలు కలిగి ఉన్న ఏకైక వ్యవసాయ విద్యా సంస్థ .. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ
కాలానుగుణం గా మారుతున్న పరిస్టితులకు అనుగుణం గా బోధనా పద్ధతులలో నూతన విధానాలు అమలు చేయడం జరుగుతోంది. సబ్జెక్టు బోధన తో పాటు పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యార్దులకు పూర్తి గైడెన్స్ అందించడం జరుగుతోంది.
ప్రతి సంవత్సరం APPLECET పరీక్ష నిర్వహిస్తూ ప్రతిభ కలిగిన విద్యార్ధులకు ఫీజులో భారీగా రాయతీ ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్దులకు సైతం నాణ్యమైన విద్యను అందిస్తోంది మన VK అగ్రి అకాడమీ.
AGRICET 2025 లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రత్యేకతలు
*అన్ని సబ్జెక్టుల సమగ్ర విశ్లేషణ
*సబ్జెక్టు మెటీరియల్ లోని “ప్రతీ లెక్చర్ నుండి ప్రతీ రోజూ ఒక పరీక్ష” నిర్వహణ ఈ ఏడాది ప్రత్యేకత
*గ్రాండ్ టెస్టులు ఎవరైనా పెడతారు …మెటీరియల్ లోని ప్రతీ లెక్చర్ నుండి పరీక్షలు నిర్వహిస్తేనే కోచింగ్ సెంటర్ తో పాటు విద్యార్ధి దమ్ము కూడా తెలిసేది” – అదే ఉద్దేశ్యం తో దాదాపు ప్రతిరోజూ ఒక పరీక్ష నిర్వహణ మరియు ఆ ప్రశ్నా పత్రం యొక్క విశ్లేషణ జరుగుతుంది. దీనికి విజయ్ కుమార్ అగ్రి అకాడమీ అక్షరాలా కట్టుబడి ఉంది. అహోరాత్రులూ కష్టపడి చదివే విద్యార్ధికి అంతకన్నా ఏం కావాలి?..
ప్రతీ లెక్చర్ నుండి ప్రతీ రోజూ ఒక పరీక్ష – AGRICET 2025
డిప్లొమా స్టడీ మెటీరియల్ ను లైన్ టు లైన్ (Line to Line) విడమర్చి చెప్పి బోధించే కోచింగ్ సెంటర్ మీ ముందు ఉన్నపుడు మీరు చింతించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. “ప్రతీ లెక్చర్ నుండి ప్రతి రోజూ ఒక పరీక్ష” ఇదే ఈ సంవత్సరం మన అకాడమీ యొక్క ట్యాగ్ లైన్. ఏ రోజుకారోజు పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు ప్రకటించి అత్యధిక మార్కులు వచ్చిన వారికి ఒక “ప్రశంసాపత్రం” ప్రధానం చేయబడుతుంది. అత్యధిక సర్టిఫికెట్లు పొందిన వారికి ఫీజులో రాయితీ కూడా లభిస్తుంది.
బాల బాలికలకు చక్కటి హాస్టల్ వసతి ఉన్నది. అకాడమీ స్వంత నిర్వహణ లోనే హాస్టల్ నిర్వహించ బడుతోంది. నిర్ణయించిన ఫీజు తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ అకాడమీ కి చెల్లించ వలసిన అవసరం లేదు.
ఫీజుల వివరాలు:
ఆపిల్ సెట్ APPLECET – 2025 లో మంచి మార్కులు పొందిన కొద్ది మంది నెలకు కేవలం రూ 3000/- చొప్పున మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. (పరీక్ష ఫలితాల మేరకు ఈ రాయితీ ఇవ్వడం పై సర్వాధికారాలూ అకాడమీ కి ఉంటాయి)
పరీక్ష రాసిన ప్రతి విద్యార్ధి నెలకు రూ 6000/- రూపాయల చొప్పున చెల్లించాలి. హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, ట్యూషన్ ఫీజు మొత్తం కలిపి నెలకు రూ 6000/- మాత్రమే. (లేదా)
6 నెలలకు గానూ రూ 12000/- ట్యూషన్ ఫీజు చెల్లించాలి. నెలకు రూ 4000/- చొప్పున మెస్ కు చెల్లించాలి. ఈ రెండు పద్ధతులలో ఏ విధానం లోనైనా ఫీజులు చెల్లించ వచ్చు. ఈ ఫీజులు తప్ప ఒక్క నయాపైసా కూడా మీరు అకాడమీ కి గాని, ఇతరులకు గానీ చెల్లించ వలసిన అవసరం లేదు.
APPLECET ఆపిల్ సెట్ 2025 వివరాలు :
100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQ) లతో ఆన్ లైన్ లో ఈ పరీక్ష నిర్వహించ బడుతుంది. దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు. ఎవరైనా ఈ పరీక్ష రాయడానికి అర్హులే. ఈ పరీక్ష యొక్క లింక్ VK అగ్రి అకాడమీ యొక్క వెబ్ సైట్ లలో, వాట్సాప్ గ్రూపులలో, వాట్సాప్ ఛానల్ లో, టెలిగ్రాం ఛానల్ లో ఇవ్వబడుతుంది.
APPLECET నిర్వహించే తేదీ:నవంబర్ 30, 2024 శనివారం మధ్యాహ్నం 2 గంటలకు
ఆన్ లైన్ పరీక్ష లింక్ కోసం క్రింది టెలిగ్రాం గ్రూపు లో లేదా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
https://forms.gle/VkGZWTXQeuzwgUpN9 ఈ లింక్ క్లిక్ చేసి పరీక్ష రాయండి
https://whatsapp.com/channel/0029Va9P81V2ZjCjP5gvpI2z
వివరాలకు సంప్రదించండి
Vijay Kumar Bomidi, Director, Vijay Kumar Agri Academy Salur Vizianagaram 8125443163