Check-in

బి.ఎస్సీ ఏజీ లో సీట్ రాలేదా...? నిరాశ పడొద్దు...మరలా ప్రయత్నించండి|try and try till you succeed|మీరు తప్పక సాధిస్తారు...


అగ్రిసెట్ లో మంచి ర్యాంక్ వచ్చినా సీట్ రాలేదా...? కొద్దిలో సీట్ మిస్ అయ్యిందా? నిరాశ చెందకండి...మరలా ప్రయత్నించండి:
పరాజయం వచ్చింది కదా అని క్రుంగి పోకూడదు... సీటు రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి.. రాత్రీ పగలూ కష్టపడి చదివినా పరీక్ష లో మంచి మార్కులు వచ్చినా కూడా సరైన ర్యాంక్ రాకపోవచ్చు... కొద్దిలో సీట్ మిస్ కావచ్చు... అంత మాత్రాన నిరాశ పడకండి..2019 అగ్రిసెట్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం....

ఎంతో మంది ప్రతిభ కలిగిన విద్యార్ధుల ఆశలు సమాధి చేసిన పరీక్ష ఇది.. ఒక ప్రామాణికం ఏదీ లేకుండా ఇచ్చిన ప్రశ్నల వల్ల సంవత్సరం పొడవునా కష్టపడి చదివిన విద్యార్ధులు పూర్తిగా నష్ట పోయారు...  2019 అగ్రిసెట్ పరీక్ష ప్రమాణాలకు చాలా దిగువగా ఉందని చెప్పవచ్చు.... ఎందుకంటే... 110 మార్కులు వచ్చిన వారికి కూడా సీట్ వస్తుందని గ్యారంటీ లేదు... పరీక్షా విధానం మారాలి.. మొత్తం పేపర్ అంతా సులువైన ప్రశ్నలతో నింపేసి ఇలా విద్యార్ధులతో ఆటలాడుకోవడం బాలేదు... గత సంవత్సరం కొన్ని ప్రాబ్లెమ్స్ ఇచ్చేసరికి పేపర్ చాలా కష్టం గా ఇచ్చేసారని చాలా హడావిడి చేసేసారు స్టూడెంట్స్....దీని ప్రభావం ఈ సంవత్సరపు పేపర్ పైన పడింది అని చెప్పవచ్చు..... ఈ సంవత్సరం పేపర్ అయితే చాలా దారుణం అని చెప్పాలి.. కొన్ని కేటగిరీ లలో 115 మార్కులకు కూడా సీట్ రావడం కష్టం... ... రాత్రనక పగలనక కష్టపడి చదివిన వారికి ఈ అగ్రిసెట్ ఫలితాలు చెంపపెట్టు అని చెప్పవచ్చు... అనేక మంది విద్యార్దులు చాలా నిరాశ లో కూరుకు పోయారు.. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి లో కొట్టు మిట్టాడు తున్నారు.. ఒకే మార్కులు వచ్చినవారు అనేక మంది ఉన్నారు... సాధారణ విద్యార్ధి కూడా  కనీసం వంద మార్కులు తెచ్చుకొనే విధం గా ఉంది ఈ అగ్రిసెట్ పేపర్... వంద మార్కులకు వెయ్యి రాంక్ వస్తే ఇంకా ఈ పరీక్ష ఎందుకు రాయడం అనేది అనేక మంది విద్యార్దుల వేదన... కాలేజీల సంఖ్యా పెరిగింది.. ఇదొక ప్రవేశ పరీక్ష కాబట్టి వీలైనంత కఠినం గానే పేపర్ ఉంటే బాగుంటుంది... అప్పుడు నిజంగా ఈ పరీక్ష కోసం అహోరాత్రులూ చదివే వారు విజయం సాధిస్తారు... కాబట్టి పరీక్ష నిర్వహించే వారు తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్ష నిర్వహిస్తే అనేక మంది విద్యార్ధులకు మేలు కలుగుతుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు... ఈ విషయం లో తెలంగాణా వారిని అభినందించక తప్పదు... ప్రతి సంవత్సరం పేపర్ ఇవ్వడం లో వీలైనంత ప్రామాణికత పాటిస్తున్నారు... 
ఏది ఏమైనప్పటికీ విద్యార్దులకు ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగి పోయింది... వచ్చే అగ్రిసెట్ పరీక్షల నైనా పటిష్టం గా నిర్వహిస్తే విద్యార్దులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది..... 

తల్లిదండ్రులకు ఒక విన్నపం
ఈ సారి సీట్ రాలేదు .... ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుందని ఏదో ఒక కోర్సులో జాయిన్ చేసేస్తున్నారు.... బి.ఎస్సీ చదవడానికి ఈ బ్యాచ్ వారికి అవకాశం లేదు... కాబట్టి సంవత్సరం వృధా అనే విషయాన్ని ప్రక్కన పెట్టి మళ్ళీ ఈ పరీక్ష రాయడానికి మీ పిల్లలను ప్రోత్సహించండి.... ఒక సంవత్సరం కష్టపడితే తప్పక విజయం సాధిస్తారు...

ఈ సంవత్సరం సీటు రాలేదని నిరాశకు గురి కావద్దు....
ఎలాగైనా బిఎస్సీ లో సీట్ కొట్టాలని కోరిక ఉంటె మాత్రం వెంటనే చదవడం ప్రారంభించండి.... చాలా సమయం ఉంది... మొన్నే కదా రాసాం అని తేలిగ్గా తీసుకోవద్దు... ఈ సారి మరింత కసిగా చదవండి... చదివిందే మళ్ళీ మళ్ళీ చదవండి... చిరాకు వచ్చినా మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉండండి.... సీట్ ఎందుకు రాదు...ఎలాగైనా సీట్ కొట్టాలని చదవండి... మనం తలచుకొంటే సాధించలేనిది ఏదీ లేదు... అగ్రిసెట్ పరీక్ష పెద్ద బ్రహ్మ పదార్ధం ఏమీ కాదు... ప్రస్తుతం వంద లోపు ర్యాంకులు వచ్చిన వాళ్లు అందరూ అలాగే చదివారు... కష్ట పడ్డారు... చాలా కష్ట పడ్డారు...అందుకే రాంకులు సంపాదించారు....కొద్దిలో మిస్ అయ్యారనే బాధ వద్దు.... ఈ సారి మరింత కష్టపడి చదవండి... మీరు తప్పకుండా విజయం సాధిస్తారు... ఇంక మనకు ఏం వస్తుందిలే అని నిరాశ పడకండి...వస్తుంది... వచ్చి తీరుతుంది....

మళ్ళీ ప్రయత్నించక పోవడమే నిజమైన ఓటమి:
అవును ... ఇంక నేను సీటు సాధించలేను అని నిరాశ చెంది ప్రయత్నించక పోవడమే నిజమైన ఓటమి.... కాబట్టి ప్రయత్నించండి.... తప్పకుండా విజయం సాధిస్తారు.. 
విజయం మీదే... మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత ఫలితం ఉంటుంది....ప్రయత్నించండి....ఒక అడుగు ముందుకు వెయ్యండి... ఈ సారి తప్పక విజయం సాధిస్తారు....ఈ విషయం గా ఏమైనా కౌన్సిలింగ్ లేదా గైడెన్స్ అవసరమైతే..... నాకు కాల్ చెయ్యండి...లేదా వాట్సాప్ చెయ్యండి 

మీ విజయ్ కుమార్ బోమిడి, (8125443163), గ్రీన్ క్రాస్ ఫౌండేషన్, సాలూరు, విజయనగరం జిల్లా... (18-09-2019)
шаблоны для dle 11.2
Views : 1 379
Published : 18-09-2019, 03:12
Author: vijaykumar
Print

# Mr Vijay Kumar, who has started this organization, is a man with vision of welfare of the underprivileged. He started this trust to help the poor and needy and motivate others to do so. He has taken up many activities which have benefited the poor and needy people of Vizianagaram District. His core area of work is the development of the Tribal people of Vizianagaram District whom he has been seeing since his childhood .

Mr. Vijay Kumar Bomidi
Founder President

Copyright 2016-2017. Website Designed and Maintained by Anilkumar. P, Ph: 9396210056