Check-in

ఉచిత అగ్రిసెట్ శిక్షణ|ఆపిల్ అగ్రిసెట్ 2020|పూర్తి వివరాలు తెలుసుకోండి|Apple Agricet Program 2020 by VK Agri Academy

ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం 2020 - ఉచిత అగ్రిసెట్ శిక్షణకు స్వాగతం !


వ్యవసాయ విద్యార్ధులకు స్వాగతం... నా పేరు విజయ్ కుమార్ బోమిడి..... విజయ్ కుమార్ అగ్రి అకాడమీ తరపున ఉచిత అగ్రిసెట్ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.. ప్రతిభావంతులైన పేద విద్యార్దులకు ఉచితం గా వ్యవసాయ విద్య ను అందించాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం 2020 ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. 
ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏంటంటే....

1. ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు సహాయ పడటం
2. వ్యవసాయ విద్య వీలైనంత చౌక గా విద్యార్దులకు అందించుట
3. గ్రామీణ ప్రాంతాలలోఉన్న డిప్లొమా విద్యార్దులను  పోటీ పరీక్షలకు తయారు చేయడం

ఇటువంటి ముఖ్య ఉద్దేశ్యాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను..

ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం అంటే ఏంటి?
సేవా దృక్పధం కలిగిన  వ్యవసాయ  అధ్యాపకుల వేదిక గా దీనిని చెప్పుకోవచ్చు. ఈ ప్రోగ్రాం లో భాగం గా వ్యవసాయ డిప్లొమా విద్యార్ధులు అందరికీ ఉచితం గా అగ్రిసెట్ కోచింగ్ ఇవ్వబడుతుంది. అయితే హాస్టల్ మరియు మెస్ బిల్ మాత్రం విద్యార్ధులు కట్ట వలసి ఉంటుంది. బాల బాలికలకు చక్కటి హాస్టల్ సదుపాయం ఉన్నది. హాస్టల్ కాకుండా బయట ఉండే డే స్కాలర్లు ఏ విధమైన ఫీజు చెల్లించ నవసరం లేదు. చక్కటి నాణ్యమైన విద్య విద్యార్ధులకు అందించడమే మా ప్రధాన లక్ష్యం...అంతే కాకుండా ఈ ప్రోగ్రాం లో భాగం గా మొత్తం 60గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. 30 గ్రాండ్ టెస్టులు కోర్సుల వారీగా ఉంటాయి. మరొక ముప్పై గ్రాండ్ టెస్ట్ లు మొత్తం అన్ని కోర్సులపైనా కలిపి ఉంటాయి. అంతే కాకుండా వీలైనన్ని రోజువారీ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. హాస్టల్ లో ఉండే ప్రతి విద్యార్ధి నెలకు 3600 రూపాయలు చెల్లించ వలసి ఉంటుంది. ఇవి కాకుండా ఇతర ఫీజులు ఏమీ ఉండవు.

ఈ ప్రోగ్రాం ద్వారా లబ్ది పొందేది ఎవరు?
నూటికి నూరు పాళ్ళు గ్రామీణ ప్రాంత వ్యవసాయ డిప్లొమా విద్యార్ధులే..... 90 శాతం మంది తల్లిదండ్రులు రైతులు మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు నిరక్ష రాస్యులు. వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ లకు పంపించే స్థోమత లేనివారు... వ్యవసాయ కోర్సుల అధ్యాపకుడు గా గత పదేళ్ళ లో  ఇటువంటి అనేక మందిని చూసిన నేపద్యం నాది. విద్యార్ధుల కోసం ఏదైనా చెయ్యాలన్న తపన తో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

అగ్రిసెట్ 2020 లో ఆపిల్ ప్రోగ్రాం లో శిక్షణ ఇస్తున్న ఇతర కోర్సులు:
1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ
3.డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్
4. డిప్లొమా ఇన్  హార్టికల్చర్

ఎక్కడ ? ఎలా వెళ్ళాలి?
విజయ నగరం జిల్లా సాలూరు లో ఈ శిక్షణా కార్యక్రమం ను ఏర్పాటు చేయడం జరిగింది. రైలు మరియు బస్ ద్వారా విజయనగరం లేదా వైజాగ్ చేరుకొని అక్కడనుండి సాలూరు బస్ ద్వారా చేరుకోవచ్చు. బయలుదేరినప్పుడు ఫోన్ చేస్తే మా సిబ్బంది మీకు అందుబాటులో ఉండి గైడ్ చేస్తారు..

బాగా చెప్తారా ?!
అత్యధికం గా డబ్బు కట్టి కోచింగ్ తీసుకొనే ఏ కోచింగ్ సెంటర్ కంటే కూడా అత్యుత్తమ విద్య అందించడం జరుగుతుంది. తరగతుల నిర్వహణ, పరీక్షల నిర్వహణ లో ఎటువంటి రాజీ లేకుండా చక్కటి నాణ్యమైన విద్య అందించడమే నా ప్రధాన మైన లక్ష్యం. 2010 అగ్రిసెట్ నుండి విద్యార్దులకు శిక్షణ ఇచ్చిన అనుభవం తో ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసాను. కాబట్టి బాగా చెప్తారా అనే సందేహం ఉండనవసరం లేదు. నేను చెప్పిన క్లాసులు గనుక చూడాలి అనుకొంటే యూ ట్యూబ్ లో greencross agri tutorials అనే చానల్ ను వెంటనే సందర్శించండి...

స్టడీ మెటీరియల్ ఏదైనా ఉందా?
రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటి సారిగా 2015 వ సంవత్సరం లో అగ్రిసెట్ గైడ్ అనే సంచిక ను తీసుకు వచ్చిన ఘనత మన అకాడమీ దే... అప్పటికి మార్కెట్ లో అగ్రిసెట్ పై ఒక్కటి అంటే ఒక్క పుస్తకం కూడా అందుబాటు లో లేదు.  అగ్రి డిప్లొమా వారికి 2011సంవత్సరం లో సిలబస్ మారినప్పుడు  కొత్త మెటీరియల్స్ రూపొందించడం లోనూ టైపింగ్ చేయడం లోనూ నా పాత్ర చాలా ఉంది... కాబట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ కార్య క్రమాన్ని నడిపించే శక్తి మాకు ఉంది అని నేను ఘంటా పధం గా చెప్పగలను.

ఇంతకు ముందు ఏవైనా మంచి రాంకులు వచ్చాయా?
మన అకాడమీ ఇంత వరకూ మంచి ఫలితాలనే సాధించింది... 2018 అగ్రిసెట్  సీడ్ టెక్నాలజీ విభాగం లో రాష్ట్ర స్థాయిలో మొదటి రాంక్ సాధించడం 2019 అగ్రిసెట్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి రాంక్ ను కైవసం చేసుకోవడం జరిగింది.. ఇవే కాకుండా అనేక అత్యుత్తమ రాంకులు సాధించి అగ్రి బిఎస్సీ లో సీట్లు సాధించారు మా విద్యార్దులు

హాస్టల్ ఉందా? వచ్చేటప్పుడు ఏమి తెచ్చు కోవాలి?
బాల బాలికలకు చక్కటి హాస్టల్ సదుపాయం ఉంది. చక్కటి హోమ్లీ మెస్ ఉంది. వచ్చేటప్పుడు మీరు చదివిన కోర్సు మెటీరియల్స్ అన్నీ తెచ్చుకోవాలి.. కొత్త సిలబస్ కి సంబంధించిన కోర్సు మెటీరియల్స్ కోచింగ్ సెంటర్ లో రుసుము చెల్లించి పొందవచ్చు.. కొద్ది రోజులు ఇక్కడ చలి కొంచం ఎక్కువ ఉంటుంది కాబట్టి బెడ్ షీట్స్, ప్లేట్, బకెట్ మరియు మీ ఆధార్ కార్డ్ కూడా తెచ్చుకోవాలి.


నెలకు ఎంత కట్టాలి? వచ్చిన తర్వాత ఇతర ఫీజులు ఏమైనా కట్టమంటారా?
మీరు మెస్ మరియు హాస్టల్ కోసం నెలకు కేవలం 3600 రూపాయలు కట్టవలసి ఉంటుంది.. ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా మీరు ఇక్కడ చెల్లించవలసిన అవసరం లేదు.. తీరా వచ్చిన తర్వాత ఎక్కువ ఫీజులు కట్టమంటారేమో అన్న అనుమానం అసలు అవసరం లేదు.

ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి?
చాలా సులువు గా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు... నా ఫోన్ నెంబర్ అందరికీ సుపరిచితమే... ఈ వ్యాసం దిగువన కూడా నా పూర్తి వివరాలు ఇస్తున్నాను. వెంటనే నా నంబర్ కు ఫోన్ చేసి ఈ ఆపిల్ ప్రోగ్రాం లో మీ సీటు confirm చేసుకోవచ్చు.

వివరాలకు వెంటనే సంప్రదించండి

విజయ్ కుమార్ బోమిడి,
ఆపిల్ అగ్రిసెట్ ప్రోగ్రాం (AAP)
విజయ్ కుమార్ అగ్రి అకాడమీ,
సాలూరు, విజయనగరం జిల్లా
మొబైల్ నంబర్ :8125443163
шаблоны для dle 11.2
Views : 377
Published : 28-12-2019, 04:45
Author: vijaykumar
Print

# Mr Vijay Kumar, who has started this organization, is a man with vision of welfare of the underprivileged. He started this trust to help the poor and needy and motivate others to do so. He has taken up many activities which have benefited the poor and needy people of Vizianagaram District. His core area of work is the development of the Tribal people of Vizianagaram District whom he has been seeing since his childhood .

Mr. Vijay Kumar Bomidi
Founder President

Copyright 2016-2017. Website Designed and Maintained by Anilkumar. P, Ph: 9396210056