Check-in

అగ్రిసెట్ పరీక్షా విధానం లో తీసుకురావలసిన మార్పులు|అగ్రిసెట్ 2019 విజేతలకు అభినందనలు



అగ్రిసెట్ విజేతలకు అభినందనలు.-అగ్రిసెట్ లో తీసుకు రావలసిన మార్పులు:
ప్రత్యేకం గా ఈ సారి విజేతలైన విద్యార్ధులకు అభినందనలు తెలియజేయకుండా ఉండలేం... ఎందుకంటే పరీక్ష ఎలా వచ్చినప్పటికీ  అనేక భావోద్వేగాలను దిగమింగి, తీవ్రమైన మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకొని ఒక్కొక్క ప్రశ్నకు సమాధానాలు రాసి ఉత్తమ రాంకులు సాధించడం అందరికీ సాధ్యం కాదు.. అందుకే.... ఈ సారి విజేతలైన వారికి “విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు” ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తోంది... ఈ సందర్భం గా అగ్రిసెట్-2019 కి సంబంధించిన కొన్ని విషయాలపై కొంత చర్చ చేద్దాం....
అగ్రిసెట్ 2019 ఎలా ఉంది అంటే.....?!
ఎలాగైనా ఏజీ బిఎస్సీ లో సీట్ సాధించాలనే కసితో అహోరాత్రులు కష్టపడి చదివిన విద్యార్దుల ఆశలు పేపర్ చూసే సరికి ఒక్కసారిగా ఆవిరి అయ్యాయి అనే చెప్పవచ్చు... ఈ సారి పేపర్ “నైరా వ్యవసాయ కళాశాల” వారు తయారు చేసారు. ఆ కళాశాలకు ఉన్న పేరు దృష్ట్యా పేపర్ చాలా కఠినం గా ఉంటుంది అని సబ్జెక్టు బాగా చదివి రాసేవారికి మంచి మార్కులు వస్తాయని విద్యార్దులు తమ ప్రిపరేషన్ కొనసాగించారు... అయితే ఈ సారి పేపర్ సెట్టింగ్ మాత్రం చాలా సాదా సీదా గా ఉన్నది... 120 ప్రశ్నలలో కనీసం 100 ప్రశ్నలు చాలా సులువుగా ఉండే ప్రశ్నలు అడిగారు... అందువల్ల అనేక మంది విద్యార్ధులు 100 మార్కులకు పైగా సాధించారు.. రాంకు విషయానికి వస్తే 100మార్కులకు గాను దాదాపు 1000 రాంకు వచ్చింది.. మొత్తం మీద 180 వరకూ సీట్లు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో వంద మార్కులు వచ్చిన వారే దాదాపు వెయ్యి మంది ఉంటే .. ఇంక పడిన కష్టానికి ప్రతిఫలం ఏది....? వ్యవసాయ డిప్లొమా విద్యార్డులకి పై చదువులు చదువుకొనే అవకాశాలే చాలా తక్కువ.. అటువంటిది ఇలా ఉన్న ఒక్క అవకాశమూ చాలా నిరాశ లోనికి నెట్టేసింది...
ఈ మధ్య జరిగిన గ్రామ సచివాలయం పరీక్ష లో కనీసం 50 శాతం ప్రశ్నలు కఠినంగా ఉండేవి అడిగారు .. మిగిలిన ప్రశ్నలు కొంచం కఠినం గా ఉండేవి అడిగారు... సులువైనవి కూడా అడిగారు గాని చాలా తక్కువ...  కాబట్టి అగ్రిసెట్ పరీక్ష పేపర్ సరిగ్గా సెట్ చెయ్యలేనందువల్ల అనేక మంది విద్యార్ధులు నష్టపోయారు అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు... ప్రవేశ పరీక్ష కాబట్టి అందరూ బాగా కష్టపడి చదువు కొని పరీక్షకు హాజరు అవుతారు... వీలైనంత వరకూ విద్యార్ధి యొక్క తెలివి తేటలను అంచనా వేసే విధం గా పేపర్ సెట్ చేస్తే అందరికీ బాగుంటుంది అనేది ఒక టీచర్ గా నా అభిప్రాయం. ఈ విషయం లో తెలంగాణా వారు ఎప్పుడూ ముందంజలో ఉంటున్నారు... ఎప్పటికప్పుడు కొత్త పంధా లో పేపర్ ఇస్తున్నారు.. ప్రతిభ గల విద్యార్ధులు తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు.... ఈ విషయం లో యూనివర్సిటీ కొంచం జాగ్రత్తలు తీసుకోవాలి.


అగ్రిసెట్ పరీక్ష నిర్వహణ లో కనీసం ఈ క్రింది ప్రమాణాలు పాటించడానికి ప్రయత్నించాలి:
1. అగ్రిసెట్ పేపర్ లో కనీసం 50 శాతం కఠినం గా ఉన్న ప్రశ్నలు అడగాలి.
 ఒక 25శాతం ఒక మోస్తరు కష్టం గా ఉన్నవి మరొక 25 శాతం సులువైన ప్రశ్నలు అడగాలి. కఠినమైన ప్రశ్నలు అంటే out of syllabus ప్రశ్నలు ఇచ్చి , సులువైన ప్రశ్నలు అంటే ... యూరియాలో నత్రజని శాతం ఎంత? వంటివి కాకుండా కొంచం మంచి ప్రశ్నలు అడిగితే... విద్యార్దులకు ఒక స్టాండర్డ్ అలవాటు అవుతుంది.. ఏ సంవత్సరం ఎలా పేపర్ వస్తుందో తెలియక చాలా తికమక పడుతున్నారు.
2. పరీక్ష నిర్వహించిన వెంటనే కీ ప్రకటించాలి:  
ఒక టీచర్ గా 2010 నుండి అగ్రిసెట్ పరీక్షలను గమనిస్తున్నా......ఇప్పటికి ANGRAU నిర్వహించిన అన్ని అగ్రిసెట్ పరీక్షలకు ఎటువంటి “కీ” విడుదల చెయ్యక పోవడం గమనార్హం... ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాదు. OMR విధానం లో పరీక్ష నిర్వహిస్తున్నపుడు “కీ” ప్రకటించ వలసిన భాద్యత కూడా యూనివర్సిటీ పై ఉన్నది.. కానీ ఈ ప్రక్రియ అంతా చాలా గుంభనం గా నిర్వహిస్తారు.  ఇలా “కీ” విడుదల చెయ్యకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. అంత పకడ్బందీ గా నిర్వహించిన సచివాలయం పరీక్షలకే లీకేజ్ మరక అంటింది.. ఇలా పరీక్ష జరిగిన తర్వాత “కీ” విడుదల చెయ్యకపోవడం వలన లోపాయికారీగా కొంత మందికి మేలు చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మెమరీ బేస్డ్ గా విడుదల చేసే “కీ” మాత్రమె విద్యార్దులకు అందుబాటు లో ఉంటున్నది కాబట్టి పరీక్ష ముగిసిన వెంటనే కీ ప్రకటించాలి.
3. డూప్లికేట్ OMR షీటు కూడా విద్యార్దులకు ఇవ్వాలి: 
డూప్లికేట్ OMR sheet విద్యార్ధులకు ఇవ్వడం వలన కీ విడుదల చేసిన వెంటనే తమకు ఎన్ని మార్కులు వస్తాయో తెలిసిపోతుంది.. అనవసరమైన వివాదాలకు తావు ఉండదు. కాబట్టి డూప్లికేట్ OMR షీట్ విద్యార్ధులకు వెంటనే ఇవ్వాలి.
4. సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ “కీ” విడుదల చెయ్యాలి:
సీడ్ టెక్నాలజీ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ విభాగాలలో కనీసం అగ్రిసెట్ మోడల్ పేపర్లు కూడా ఎవరి దగ్గరా లేవు.. దీనితో ఆంద్ర విద్యార్దులు అందరూ తెలంగాణా వారి పేపర్లనే మోడల్ పేపర్లు గా చదువుకోవలసి వస్తుంది.. కాబట్టి సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రికల్చర్ విభాగాలలో 2010 నుండి నిర్వహించిన అగ్రిసెట్ పేపర్లు వాటి యొక్క “కీలు” విడుదల చేస్తే విద్యార్దులకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు.
5. ఆన్ లైన్ పరీక్ష నిర్వహించండి: ఈ OMR పరీక్షా విధానం ఇబ్బంది కరం గా ఉంటే... ఆన్ లైన్ పధ్ధతి లో పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది.. ఫలితాలు కూడా వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.. ఆంధ్రా అగ్రిసెట్ ఫలితాలు వచ్చి కౌన్సిలింగ్ జరిగే సరికి బిఎస్సీ అగ్రికల్చర్ లో సగానికి పైగా క్లాసులు అయిపోతున్నాయ్... కాబట్టి వెంటనే ఫలితాలు విడుదల చేసేలా ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తే మంచిది...
6. ఫలితాలు వెంటనే ప్రకటించండి: ఇప్పటివరకూ అయితే OMR షీట్లలో వచ్చిన మార్కులకు గ్రేడ్ పాయింట్ ను బట్టి రాంకులు కేటాయిస్తున్నారు. దాదాపు నాలుగు లేక ఐదు వేలమంది రాసే పరీక్ష కు OMR షీట్స్ మదింపు కార్యక్రమం ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చెయ్యవచ్చు.. కాని ఫలితాలు రావడానికి మాత్రం నెలల సమయం పడుతోంది.. దీనికి ప్రధాన కారణం చివరి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు రావడం చాలా లేట్ కావడం, అవి వచ్చిన తర్వాత ఆయా కళాశాలల్లో గ్రేడు పాయింట్ల లెక్కింపు చాలా లేట్ కావడం వల్ల అగ్రిసెట్ ఫలితాలు కూడా చాలా లేటుగా వస్తున్నాయి... ఈ సంవత్సరం ప్రకటించినట్టు కనీసం మార్కులు అయినా ముందుగా ప్రకటిస్తే విద్యార్ధులు ఏదో ఒక దారి చూసుకుంటారు... అగ్రిసెట్ రాంక్ వస్తుందేమో అని ఎంతో కాలం వేచి చూసి తీరా రాకపోయేసరికి ఇతర అవకాశాలు కూడా సన్నగిల్లే పరిస్థితి ఇప్పుడు ఉంది.. అదే మార్కులు ముందే తెలిసిపోతే .. కనీసం ఏదైనా ఒక మంచి ప్రైవేట్ కాలేజీ లో నైనా సీట్ కోసం ప్రయత్నాలు చేస్తారు లేదా బిఎస్సీ లో జాయిన్ కావడానికి ప్రయత్నాలు చేసుకొంటారు...
ఈ వ్యాసం ప్రారంభం లో విద్యార్దులకు అభినందనలు ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు చెప్తా.... ఇన్ని అవాంతరాలు ఎదుర్కొంటూ మొక్కవోని దీక్షతో శ్రమించి సీట్లు సాధించిన ప్రియమైన విద్యార్దులకు నిజంగా హాట్సాఫ్ చెప్పి తీరాలి..... ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో సీట్లు సాధించిన విద్యార్ధులు అందరికీ మరొక్క సారి ప్రత్యేకమైన అభినందనలు...
మీ
విజయ్ కుమార్ బోమిడి, గ్రీన్ క్రాస్ ఫౌండేషన్, సాలూరు, విజయనగరం జిల్లా (8125443163) (22-09-2019)шаблоны для dle 11.2
Views : 411
Published : 22-09-2019, 04:01
Author: vijaykumar
Print

# Mr Vijay Kumar, who has started this organization, is a man with vision of welfare of the underprivileged. He started this trust to help the poor and needy and motivate others to do so. He has taken up many activities which have benefited the poor and needy people of Vizianagaram District. His core area of work is the development of the Tribal people of Vizianagaram District whom he has been seeing since his childhood .

Mr. Vijay Kumar Bomidi
Founder President

Copyright 2016-2017. Website Designed and Maintained by Anilkumar. P, Ph: 9396210056