Check-in

ఏజీ బిఎస్సీ వదిలి VAA ఉద్యోగం లో చేరవచ్చా....? కొన్ని ముఖ్యాంశాలు మీ కోసం


ఏజీ బిఎస్సీ వదిలి వి.ఏ.ఏ. లో చేరేవచ్చా?
అహో రాత్రులు కష్టపడి సాధించుకున్న బి ఎస్సీ అగ్రి సీట్ ఒకవైపు, వి.ఏ.ఏ గవర్నమెంట్ ఉద్యోగం ఒకవైపు... దేనికి సై అనాలో తెలియని సందిగ్ధ స్థితి లో ప్రస్తుతం కొట్టు మిట్టాడుతున్నారు కొంతమంది విద్యార్దులు.... నిజానికి ఇది ఒక క్లిష్ట సమస్య... ఎందుకంటే.. ఒక ప్రక్క గవర్నమెంట్ ఉద్యోగం.. తీరా నాలుగేళ్ళు కష్టపడి చదివినా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు.. కాబట్టి చదువును పక్కన బెట్టి ఉద్యోగం లో జాయిన్ కావడమే మంచిది అని చాలా మంది భావిస్తున్నారు.. తల్లి దండ్రులు కూడా ఉద్యోగం వదులుకోవద్దని పిల్లలపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు.
వి.ఏ.ఏ. ఉద్యోగం మంచిదేనా....?
ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ బట్టి చూస్తే ఈ ఉద్యోగం మంచిదే అనిపిస్తుంది. అయితే వ్యవసాయ డిప్లొమా, వ్యవసాయ డిగ్రీ అర్హతలు కలిగిన వారికి  ఈ ఉద్యోగం సరైనదే అని చెప్పవచ్చు.గ్రేడ్- 2 ఉద్యోగం దీనిని పరిగణిస్తున్నారు.. సర్వీసును బట్టి దీనిని గ్రేడ్ 1 కు పదోన్నతి కలిగిస్తామని ప్రభుత్వం చెబుతోంది.. కాబట్టి పై అర్హతలు కలిగిన వారు ప్రభుత్వ ఉద్యోగం లో చేరిపోవడమే సరైనది అని చెప్పవచ్చు. ఎం ఎస్సీ అంతకంటే ఎక్కువ విద్యార్హతలు చదివిన వారు కూడా ఈ పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారు. వీరు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీరికి ఉద్యోగావకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలి అనే ఆకాంక్ష ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ ఉద్యోగం లో చేరిపోవచ్చు. ఎందుకంటే ఎమ్మెస్సీ చదివినా సరే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గ్యారంటీ అయితే లేదు. ఇప్పటికే ఉద్యోగాలలో చేరి అరవై డెబ్భై వేలకు పైగా సంపాదిస్తున్నవారు ఏదీ తేల్చుకోలేక పోతున్నారు.. అంత ఆదాయ వచ్చే ఉద్యోగం వదిలేసి ఈ ఉద్యోగం ఎలా చేస్తాం అని ఒకవైపు, ప్రభుత్వ ఉద్యోగం కదా అని ఒకవైపు ఏదీ తేల్చుకోలేక పోతున్నారు. ఈ వ్యాసం లో ఒక్కొక్కరికి ఉన్న కొన్ని పరిష్కార మార్గాల గురించి చర్చిద్దాం...
1. అగ్రిసెట్ లో మంచి ర్యాంకు, వి.ఏ.ఏ లో మంచి మార్కులు వచ్చిన వారు.
అగ్రిసెట్ లో మంచి రాంక్ వచ్చినప్పటికీ... వి.ఏ.ఏ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే మాత్రం దానిని అసలు వదులుకోవద్దు.. బిఎస్సీ అగ్రికల్చర్ సీట్ సంపాదించడం అంత సులువు ఏమీ కాదు.. ఈ విషయం మొన్న అగ్రిసెట్ రాసిన విద్యార్దులు అందరికీ బాగా అర్ధమయ్యే ఉంటుంది.. కాని ప్రభుత్వ ఉద్యోగావకాశాలు మాత్రం పదేపదే రావు... గమనించండి.. అగ్రిసెట్ ఒకసారి కాకపోతే మరొక సారి సంపాదించవచ్చు. కాని ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాదు.. కాబట్టి మీకు నిజం గా చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం లో జాయిన్ కావడమే మంచిదని మా అభిప్రాయం. ఉద్యోగం లో చేరిన తర్వాత ఇన్ సర్వీస్ గా మళ్ళీ బిఎస్సీ అగ్రి చదివే అవకాశం ఉంటుంది... దానికోసం మీరు సిద్ధం గా ఉంటే మంచిది.. అప్పుడు ఉద్యోగం ఉంటుంది... కోరుకున్న చదువు కూడా ఉంటుంది... అర్హతలు ఉంటే ఏ.ఈ ఓ లేదా ఏ ఓ గా పదోన్నతి పొందే అవకాశం కూడా మెండు గా ఉంటుంది.. ఉద్యోగం లో జాయిన్ అవ్వమని పేరెంట్స్ చెప్తే కొంచం బాధగా అనిపిస్తుంది... కాని భవిష్యత్తు దృష్ట్యా చూస్తే మాత్రం వాళ్ళు చెప్పిందే కరక్టు అనిపిస్తుంది.. చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగం పొందితే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది.. వ్యవసాయ డిప్లొమా విద్యార్దులకు ప్రభుత్వ ఉద్యోగం రావడం కన్నా గొప్ప అవకాశం ఏమి ఉంటుంది ?  (ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే... వి.ఏ.ఏ కి సర్టిఫికెట్లు ఆన్ లైన్ లో పెట్టడం, అక్కడ అగ్రిసెట్ కౌన్సిలింగ్ ఒకేసారి ఉన్నాయ్ .. కాబట్టి వి.ఏ.ఏ మెరిట్ లిస్టు ఇంకా రాకపోతే మాత్రం ముందు కౌన్సిలింగ్ కి హాజరు అవ్వండి... మీ జిల్లా లో మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే అప్పుడు అగ్రిసెట్ సీట్ వదిలెయ్యండి.. అలా కాకుండా ఉద్యోగం కొంచం అనుమానం అనుకొంటే వెంటనే బిఎస్సీ అగ్రి లో జాయిన్ అయిపోండి.. ఒకవేళ అప్పటికీ మీకు ఉద్యోగం వస్తే.... ఏజీ బిఎస్సీ సీట్ వదిలేసుకోవచ్చు... ) ఒకే రోజుల్లో ఈ కౌన్సిలింగ్, ఉద్యోగాలలో జాయిన్ కావడం ఉండడం వల్ల అందరికీ చాలా ఇబ్బంది గా ఉంది. కౌన్సిలింగ్ మరొక వారం రోజులు వాయిదా వేస్తే అందరికీ మేలు జరిగేది....
2. బిఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నవారు.
ఎంతో కష్టపడి బిఎస్సీ అగ్రికల్చర్ లో సీట్ సంపాదించి ఉత్సాహంగా చదువుతున్న వారికి ఈ రిక్రూట్ మెంట్ వల్ల ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది... ప్రస్తుతం అగ్రి బిఎస్సీ చదువుతున్న వారిలో చాలా మంది వ్యవసాయ డిప్లొమా నుండి అగ్రిసెట్ లో సీట్ సంపాదించిన వారే ఉన్నారు.. వీరందరికీ వి.ఏ.ఏ పరీక్ష రాసే అవకాశం లభించింది... చాలా మంది చాలా మంచి మార్కులు సంపాదించు కొన్నారు.. అంటే వీరికి వారి వారి జిల్లాలలో తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.. అయితే బి.ఎస్సీ అగ్రికల్చర్ మధ్యలో వదిలివేయడానికి మనసు ఒప్పడం లేదు.. అలాగని ప్రభుత్వ ఉద్యోగం వదులుకోలేరు.... అయితే బిఎస్సే అగ్రికల్చర్ ఆరేళ్ళ లో పూర్తి చేయవచ్చు కాబట్టి ముందుగా ఉద్యోగం లో జాయిన్ అయ్యి అక్కడ ప్రొబేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ డిగ్రీ పూర్తి చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది.. బిఎస్సీ అగ్రి చదివినా ఇకముందు ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు కాబట్టి చదువు మధ్యలో వదిలి ఉద్యోగం లో జాయిన్ కావచ్చు.... అయితే డిగ్రీ పరిమిత కాలం తర్వాత పూర్తి చేసుకొంటే ఉద్యోగం ఉంటుంది... డిగ్రీ ఉంటుంది.. తద్వారా పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది... కాబట్టి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.. ఉదోగం లో జాయిన్ అవ్వకుండా తప్పు చేసాం అని జీవితం లో తర్వాత ఎప్పుడైనా బాధ పడకుండా ఉండాలంటే మాత్రం వెంటనే ఉద్యోగం లో జాయిన్ అవ్వండి... ఒకవేళ మీకు ఈ ఉద్యోగం నచ్చక పోతే కొంత కాలం తర్వాత దానిని వదిలేసి అప్పుడు మీ చదువు పూర్తి చేసుకోవచ్చు... ఊరికే డిగ్రీ చదివి ఏదో చేద్దాం అనుకొంటే మాత్రం ఉద్యోగం లోనే ఉండండి.. ఎమ్మెస్సీ అంతకంటే ఇంకా ఎక్కువ చదువుకోవాలి అంటే మాత్రమే ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకి రండి.. ఈ రోజుల్లో బిఎస్సీ అగ్రి చదివిన వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంది... కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి...
3.  ఎమ్మెస్సీ, పి హెచ్.డి. చేసినవారు, చేస్తున్నవారు:
వీరికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి.. ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలి అని కోరిక ఉంటె మాత్రం వెంటనే ఈ ఉద్యోగం లో చేరండి... చాలా కాలం గా తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటారు కాబట్టి ఇలా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎందుకు వదులుకోవాలి అని వారు చాలా ఒత్తిడి చేస్తుంటారు... కాబట్టి మీ వీలును బట్టి వీలైనంత వరకు ఉద్యోగం లో చేరడానికి ప్రయత్నించండి.. ఒకవేళ ఆ తర్వాత మంచి ఉద్యోగావకాశాలు వస్తే మాత్రం ఈ ఉద్యోగానికి రాజీనామా చెయ్యవచ్చు... ఇంకా ఆయా కోర్సులు చదువుతున్నవారు కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు... మీ జిల్లా లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందొ లేదో ముందు చూసుకోండి... ఒకవేళ మీకు వచ్చిన మార్కులకు మీకు ఉద్యోగం వస్తుంది అనుకొంటే మాత్రం.... జాయిన్ అవ్వండి...  ఆ తర్వాత పరిస్థితి ని బట్టి ఉద్యోగం లో ఉండటమో లేదో నిర్ణయం తీసుకోవచ్చు...


ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మీకు సరైనది ఎంచుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం తో వివిధ అంశాలపై ఇక్కడ చర్చ చేయడం జరిగింది... తుది నిర్ణయం మాత్రం మీదే...
మీ....
 విజయ్ కుమార్ బోమిడి, గ్రీన్ క్రాస్ ఫౌండేషన్, సాలూరు, విజయనగరం జిల్లా (8125443163) (21-09-19)шаблоны для dle 11.2
Views : 1 328
Published : 21-09-2019, 15:37
Author: vijaykumar
Print

# Mr Vijay Kumar, who has started this organization, is a man with vision of welfare of the underprivileged. He started this trust to help the poor and needy and motivate others to do so. He has taken up many activities which have benefited the poor and needy people of Vizianagaram District. His core area of work is the development of the Tribal people of Vizianagaram District whom he has been seeing since his childhood .

Mr. Vijay Kumar Bomidi
Founder President

Copyright 2016-2017. Website Designed and Maintained by Anilkumar. P, Ph: 9396210056