Check-in

అగ్రిసెట్ 2019|ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే?|అగ్రిసెట్ లాంగ్ టర్మ్ వివరాలు|విజయ్ కుమార్ అగ్రిసెట్ ఇనిస్టిట్యూట్|సాలూరు

అగ్రిసెట్ కి నాలుగు నెలల కోచింగ్ సరిపోతుందా....?
ఈ మధ్యనే అగ్రిసెట్ 2018 హడావుడి ముగిసింది.... అయితే ఈ సంవత్సరం పరీక్షా ఫలితాలు చాలా ఆలస్యం గా రావడం వల్ల సీట్లు రాని విద్యార్దులు అందరూ ఇంకా చాలా సమయం ఉందిలే అని రిలాక్స్ అవ్వడాన్ని గమనించవచ్చు.... దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే..... సంక్రాంతి తర్వాత ప్రిపరేషన్ ప్రారంభం చేద్దాం అనే ధీమా గత కొద్ది సంవత్సరాలు గా విద్యార్దులలో కనిపిస్తోంది... దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి... ఎందుకంటే మన కోచింగ్ సెంటర్లు అన్నీ అప్పుడే బ్యాచ్ లు ప్రకటిస్తాయి....
విలువైన సమయం వృధా చేసేస్తున్నారు:
విలువైన సమయం అంతా వృధా చేసేసి.... ఆదరా బాదరాగా ఆ నాలుగు నెలలూ క్రిందా మీదా పడటం వల్ల అనేక మంది విద్యార్దులు సిలబస్ పూర్తి చేసుకోలేక సరైన ర్యాంక్ సాధించ లేక పోతున్నారు... మంచి గ్రేడ్ పాయింట్ సాధించిన వారికి కొంత వరకు  నాలుగు నెలల కోచింగ్ ఉపయోగ పడవచ్చు... అదే సాధారణ విద్యార్దికి ఆ కొద్ది ప్రిపరేషన్ సరిపోతుందా అనేదే ఆలోచించవలసిన విషయం... దాదాపు 17 కోర్సులు క్షుణ్ణం గా చదివి రాయవలసిన పరీక్ష ను అంత తేలిగ్గా తీసుకోవడం ఎంత వరకు సమంజసం... ఇక్కడే సాధారణ విద్యార్దులు అందరూ తప్పటడుగు వేస్తున్నారు... అన్ని కోర్సులు చదవ కుండా కేవలం కొన్ని కోర్సుల్లో ఉన్న పరిజ్ఞానం తో పరీక్షలు రాసి రాంక్ రాక బంగారు భవిష్యత్ కోల్పోవలసి వస్తోంది... ఆ తర్వాత పై చదువులు చదవ లేక అనేక మంది ఇంట్లో ఖాళీ గా ఉండి తల్లిదండ్రులకు భారం గా ఉంటున్నారు....
గత పదేళ్ళ అనుభవం తో విద్యార్దులకు నా సలహా ఏంటి అంటే:
గత పదేళ్ళు గా అగ్రిసెట్ పరీక్షల పై ఉన్న అనుభవం తో నేను మీకు ఇచ్చే సూచనలు ఏంటంటే........అగ్రిసెట్ కి మీ ప్రిపరేషన్ వెంటనే ప్రారంభించండి.... సెమిస్టర్ల వారీగా మీ స్టడీ మెటీరియల్ చదవడం ప్రారంభించండి.... కోచింగ్ సెంటర్ల స్టడీ మెటీరియల్స్ ఇప్పుడే వద్దు.... ముందు మీ కోర్సు మెటీరియల్స్ (యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఉన్నవి) పూర్తి గా చదవడం ప్రారంభించండి.... ఇంతకు ముందు మీరు ఏమి చదవ కుండా మిస్ అయ్యారో మీకు క్లియర్ గా తెలుస్తుంది... మీరు చేసిన పొరపాట్లు కూడా మీకు బాగా తెలుస్తాయి... వాటిని ఒక దగ్గర రాసుకోండి... ఈ విధంగా మీ ప్రిపరేషన్ ప్రారంభించండి... ఇలా పూర్తిగా చదవాలంటే.. మీకు నాలుగు నెలలు ఏ విధం గానూ సరిపోదు....
కనీసం 8 నెలల పూర్తి స్థాయి ప్రిపరేషన్ అవసరం:
కనీసం 8 నుండి 10 నెలల ప్రిపరేషన్ ఉంటే పరీక్ష ఏ విధం గా వచ్చినా దానిని ఎదుర్కొన గలిగే శక్తి ఉంటుంది... ఈ విషయాలు అన్నిటిని దృష్టి లో పెట్టుకొని విజయ్ కుమార్ అగ్రిసెట్ ఇనిస్టిట్యూట్ సాలూరు లో నవంబర్ 1, 2018 నుండి 8 నెలల లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రారంభిస్తున్నాం....ఫీజు తదితర వివరాల కొరకు ఫోన్ చెయ్యండి...

మీ ప్రిపరేషన్ వెంటనే ప్రారంభించండి.... మంచి రాంక్ సాధించడానికి కావలసిన అనేక టిప్స్ కోసం ఈ వెబ్ సైట్ ను చూస్తూ ఉండండి...

విజయ్ కుమార్ బోమిడి, 8125443163
విజయ్ కుమార్ అగ్రిసెట్ ఇనిస్టిట్యూట్, సాలూరు,
విజయనగరం జిల్లా 

 шаблоны для dle 11.2
Views : 1 505
Published : 26-10-2018, 02:06
Author: vijaykumar
Print

# Mr Vijay Kumar, who has started this organization, is a man with vision of welfare of the underprivileged. He started this trust to help the poor and needy and motivate others to do so. He has taken up many activities which have benefited the poor and needy people of Vizianagaram District. His core area of work is the development of the Tribal people of Vizianagaram District whom he has been seeing since his childhood .

Mr. Vijay Kumar Bomidi
Founder President

Copyright 2016-2017. Website Designed and Maintained by Anilkumar. P, Ph: 9396210056